రేవంత్ రెడ్డి

గురించి

” రైజింగ్‌ సన్‌ ఇన్‌ తెలంగాణ పాలిటిక్స్‌ “

రేవంత్‌రెడ్డి అన్నది తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు…
అంతులేని ఆత్మవిశ్వాసనికి.. మొక్కవోని పోరాటపటిమకు.. మడమ తిప్పని పౌరుషానికి.. అపజయమెరుగని నిర్భయానికి ఒక రూపమంటూ వస్తే అది అచ్చు రేవంత్‌రెడ్డిలా ఉంటుంది. ఆయన మాటల్లో అంతులేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది, అంతర్లీనంగా ఆయన మేధస్సుకు అద్ధం పడుతుంది. దీక్ష దక్షతలకు నిదర్శనమైన రేవంత్‌రెడ్డిది రాజకీయాల్లో పోలికలకు దొరకని విభిన్నమైన శైలి. సమస్యను విశ్లేషించడంలో, దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో అందె వేసిన చేయి.

విజన్‌ :

ఏ విషయానైనా రేవంత్‌ చూసే దృష్టికోణం విభిన్నంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఆయనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిని గురించి, చదువులు, కొలువులను గురించి, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలను గురించి స్పష్టమైన లక్ష్యాలున్నాయి.

Vision (2)
mission (1)

మిషన్‌ 19… మిషన్‌ 99

మిషన్‌ 19/99 అన్నది రేవంత్‌రెడ్డి ప్రజాపోరాట లక్ష్యం. ఐదు దశాబ్దాల సుదీర్ఘపోరాటం ఫలితంగా తెలంగాణను సాధించుకున్నా దాని ఫలితాన్ని మాత్రం ఒకే కుటుంబం అనుభవించడాన్ని రేవంత్‌ వ్యతిరేకిస్తారు. ”భారత స్వాతంత్య్ర ఫలాలను కూడా ఇదే విధంగా ఒకే కుటుంబం అనుభవిస్తూ మాదే ఇండియా, మేమే ఇండియా అని ప్రచారం చేసుకొని అరవై ఏళ్లకు పైగా పరిపాలించిన ఫలితంగానే భారతదేశం అభివృద్ధి రంగంలో వెనుకబడి పేదరికం, ధరిద్రం దేశంలో స్థిరపడిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా నెహ్రూ కుటుంబం తరహాలో కేసీఆర్‌ కుటుంబం కూడా ఏకఛత్రాధిపత్యంలో ఏలాలని చూస్తోంది. అదే జరిగితే తెలంగాణ కూడా తీవ్రంగా నష్టపోతుంది.. ఒకప్పుడు గడీలలో కొనసాగిన దొరల పాలన మళ్లీ మొదలవుతుంది.. కానీ నేను అలా జరగనివ్వను, ఎంతవరకైనా పోరాడుతూను..” అన్నది రేవంత్‌ విధానం. ఈ విధానంతో 2019లో తెలంగాణా వ్యాప్తంగా 99 మంది ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్వర్గీయ ఎన్టీ రామారావు రీతిలో జనరంజకమైన పరిపాలన అందించాలన్నదే ఆయన మిషన్‌ లక్ష్యం.. ఈ లక్ష్య సాధన దిశగా రేవంత్‌ ఇప్పటికే దూసుకుపోతున్నారు.

అసాధారణ స్థాయికి ఎదిగిన సామాన్యుడు..

తాను తల పెట్టిన ఏ పనైనా పూర్తయ్యేవరకూ ఆయనకు నిద్రపట్టదు. తాను నిజమని నమ్మిన విషయాన్ని రుజువు చేయడానికి ఏ స్థాయిలోనైనా ఆయన వెకడాడడు.. ఎంతటి వారితోనైనా పోరాటానికి వెనుదీయడు.. ఆయన చేసే ప్రతి పనిలోనూ జనహితం కనిపిస్తుంది.. జనానికి మేలు చేయాలన్న తపనే నిర్విరామంగా ఆయనను ముందుకు నడిపిస్తుంది. ప్రలోభాలకు లొంగిపోవడం బెదిరిస్తే భయపడటం ఆయన చరిత్రలోనే లేదు. ఈ విశిష్టతత్వమే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామంలో పుట్టిన రేవంత్‌రెడ్డిని తెలంగాణా రాజకీయాల్లో ఒక తిరుగులేని నాయకుడిని చేసింది..

సాధించిన విజయాలు

జి.పి.టి.సి

2006 లో అతను మిడ్జిల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ పార్టీ ఓట్ల లాభం 51,65% తో జి.పి.టి.సి ఎన్నికల గెలిచింది.

ఎమ్మెల్సీ

అతను 2008 లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనమండలికి ఎమ్మెల్సీ సభ్యుడు ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యే

2009 లో, అతను 46,45% ఓట్లతో కోడంగల్ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.

రాజకీయ

వృత్తి

ప్రజల మనిషి – ఫైర్‌ బ్రాండ్‌..

ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రేవంత్‌రెడ్డి వివాహమయ్యేంతవరకూ చెప్పుకోదగ్గ రాజకీయ నేపథ్యమేమీ లేదు. అయితే ఒక ప్రజానాయకుడిగా ఎదగాలన్న కోరికమాత్రం ఆయనకు స్కూలు రోజుల నుంచీ ఉండేది. ఈ కారణంగానే స్నేహబృందాలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ప్రయత్నం చేస్తుండేవారు.

రేవంత్ రెడ్డి ని

సంప్రదించండి

దయచేసి మా ఇతర వెబ్సైట్లు సందర్శించండి.

ఒక సందేశాన్ని పంపడానికి సంకోచించకండి