రేవంత్ రెడ్డి

అంతులేని ఆత్మవిశ్వాసనికి.. మొక్కవోని పోరాటపటిమకు.. మడమ తిప్పని పౌరుషానికి.. అపజయమెరుగని నిర్భయానికి ఒక రూపమంటూ వస్తే అది అచ్చు రేవంత్‌రెడ్డిలా ఉంటుంది. ఆయన మాటల్లో అంతులేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది, అంతర్లీనంగా ఆయన మేధస్సుకు అద్ధం పడుతుంది. దీక్ష దక్షతలకు నిదర్శనమైన రేవంత్‌రెడ్డిది రాజకీయాల్లో పోలికలకు దొరకని విభిన్నమైన శైలి. సమస్యను విశ్లేషించడంలో, దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో అందె వేసిన చేయి. తాను తల పెట్టిన ఏ పనైనా పూర్తయ్యేవరకూ ఆయనకు నిద్రపట్టదు. తాను నిజమని నమ్మిన విషయాన్ని రుజువు చేయడానికి ఏ స్థాయిలోనైనా ఆయన వెకడాడడు.. ఎంతటి వారితోనైనా పోరాటానికి వెనుదీయడు.. ఆయన చేసే ప్రతి పనిలోనూ జనహితం కనిపిస్తుంది.. జనానికి మేలు చేయాలన్న తపనే నిర్విరామంగా ఆయనను ముందుకు నడిపిస్తుంది. ప్రలోభాలకు లొంగిపోవడం బెదిరిస్తే భయపడటం ఆయన చరిత్రలోనే లేదు. ఈ విశిష్టతత్వమే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామంలో పుట్టిన రేవంత్‌రెడ్డిని తెలంగాణా రాజకీయాల్లో ఒక తిరుగులేని నాయకుడిని చేసింది..

అసాధారణ స్థాయికి ఎదిగిన సామాన్యుడు..

ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రేవంత్‌రెడ్డి వివాహమయ్యేంతవరకూ చెప్పుకోదగ్గ రాజకీయ నేపథ్యమేమీ లేదు. అయితే ఒక ప్రజానాయకుడిగా ఎదగాలన్న కోరికమాత్రం ఆయనకు స్కూలు రోజుల నుంచీ ఉండేది. ఈ కారణంగానే స్నేహబృందాలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ప్రయత్నం చేస్తుండేవారు. ఆర్ట్స్‌లో పట్టభద్రుడైన తర్వాత ఆయన తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆయనది ప్రేమ వివాహం కాగా ఈ పెళ్లి కారణంగా కాంగ్రెస్‌ నేత ఎస్‌.జైపాల్‌ రెడ్డితో బంధుత్వం ఏర్పడింది. ఈ బంధుత్వాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయాల్లోకి నేరుగా అరంగేట్రం చేసే అవకాశం ఉన్నా ఆయన ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు.

పాఠశాల మరియు కళాశాల రోజుల

రాజకీయ చరిత్ర

ప్రజల మనిషి – ఫైర్‌ బ్రాండ్‌..

ఆర్ట్స్‌లో పట్టభద్రుడైన తర్వాత ఆయన తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆయనది ప్రేమ వివాహం కాగా ఈ పెళ్లి కారణంగా కాంగ్రెస్‌ నేత ఎస్‌.జైపాల్‌ రెడ్డితో బంధుత్వం ఏర్పడింది. ఈ బంధుత్వాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయాల్లోకి నేరుగా అరంగేట్రం చేసే అవకాశం ఉన్నా ఆయన ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. అప్పటివరకూ తన మిత్రులతో కలిసి స్వచ్ఛందంగా ప్రజాహిత సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న రేవంత్‌ ప్రజలకు మరింత సేవ చేయాలంటే అధికారం కావాలని, దాని కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తనపై ఎవరి ముద్రా పడకుండా చూసుకోవాలని తన స్వశక్తితోనే రాజకీయాల్లోకి చేరి తన సత్తా చాటుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒకేసారి పెద్ద పదవుల కోసం ఆశపడకుండా అంచెలంచెలుగా ఎదగాలనే లక్ష్యంతో తొలుత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌ అనే మండలానికి జడ్పీటీసీ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. రాజకీయపరంగా అత్యంత ప్రభావితమైన ఈ మండలంలో యువకుడైన రేవంత్‌ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడమే అప్పట్లో సంచలనం కలిగించింది. ఈ విధంగా రేవంత్‌ రాజకీయ ప్రస్థానం 2006లో సాదాసీదాగా మొదలైంది. అప్పట్లో ఎవరూ కూడా ఆయన మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా ఎదుగుతారని కూడా ఊహించలేదు. ఎవరి ఊహలకు అందని రీతిలో ఆయన రాజకీయాల్లో ఎదగడం మొదలు పెట్టారు. జడ్పీటీసీ మెంబర్‌గా ఎన్నికైన తర్వాత ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగే అవకాశం ఉన్నా అందుకోసం ఆయన కాచుకొని కూర్చోలేదు.

మండల స్థాయి నుంచి ఆపై స్థాయికి ఎదగడానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తూ ఏడాది తిరక్కుండానే 2007లో మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పట్లో ఉన్న పార్టీల బలాబలాల ప్రకారం అయితే ఈ ఎన్నికలలో అప్పట్లో అధికారపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థో లేకపోతే విపక్షమైన తెలుగుదేశం అభ్యర్థి మాత్రమే గెలవాలి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరికెంత మెజారిటీ వస్తుందన్న లెక్కలు చూసుకుంటుండగానే రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్‌ ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలతో ఆయన రాజకీయ చతురత ఏమిటో అందరికీ అర్థమైయింది. అప్పటిదాకా రాజకీయాల్లో ఆయన్ను ఒక సాధారణమైన నేతగానే భావించినవారికి ఆయన విశ్వరూపం కనిపించింది. ఎమ్మెల్సీగా గెలిచేదాకా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గానే ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్రస్థాయికి ఎదగాలంటే ఒక రాజకీయపార్టీ వేదిక కూడా కావాలని నిర్ణయించుకున్నారు. అందుకని తన భావజాలానికి దగ్గరగా ఉండే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంలోకి చేరారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తరుణంలో అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో అవకతవకలు, అక్రమాలపై ఆధారాలను సంపాదించి వాటిని మండలిలో బయటపెట్టి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. పలు సమస్యలపై గళమెత్తి అధికార పార్టీని హడలెత్తించారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రేవంత్‌ పేరు వినిపించడం మొదలైంది. ఈవిధంగా ఎమ్మెల్సీగా తాను రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలోనే 2009లో రాబోతున్న సాధారణ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో తన సత్తా చాటుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఎన్నికలలో రేవంత్‌ కోరుకొని ఉంటే తన సొంత నియోజకవర్గమైన కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు దక్కి ఉండేది. తన బంధువర్గమంతా ఆ ఎన్నికల్లో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి ఉండేది. కానీ నియోజకవర్గాన్ని కోరుకోవడంలోనూ రేవంత్‌ తన విలక్షణశైలిని చాటుకున్నారు.

సాధారణ నాయకులు ఎవరూ కన్నెత్తి చూడటానికే భయపడే కోడంగల్‌ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అప్పటికి కోడంగల్‌ను ఒక ‘దొర’ ఏలుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6సార్లు అతనే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. గడీ నుంచి పాలన సాగించే ఆ దొర ముందు ఎంతటి అధికారి అయినా కూర్చోవడానికి వీల్లేదు. అతనికి ఎదురు తిరిగిన వారెవరూ ఆ నియోజకవర్గంలోనే ఉండటానికి కూడా వీల్లేదు. అయితే బెదిరిస్తారు, కాదంటే చంపేస్తారు.. అక్కడ వాళ్లు చెప్పిందే వేదం, దొర చేసిందే శాసనం.. అలాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక నేత మరణించగా అక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు తమను ఆదుకోవడానికి ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్న తరుణంలో రేవంత్‌ తమ పార్టీకి సవాల్‌ విసురుతున్న ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్లో ఆయనను బెదిరించారు, భయపెట్టారు, ఆఖరి ప్రయత్నంగా భౌతికదాడికి కూడా పాల్పడ్డారు. అయినా ఆయన బెదరలేదు, ఆయన ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. కోడంగల్‌ ప్రజలు కూడా దొర బారి నుంచి తమను కాపాడటానికి వచ్చిన రేవంత్‌రెడ్డికే పట్టం కట్టారు. ఈ విధంగా రేవంత్‌ 2009 నాటికి ఎమ్మెల్యేగా ఎదిగారు. తాను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నా తన నియోజకవర్గమైన కోడంగల్‌ ప్రజల బాధలు, కష్టాల్లోనూ రేవంత్‌ తోడునీడగా ఉన్న కారణంగానే 2014లో జరిగిన ఎన్నికల్లోనూ రెండవసారి ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఒకవైపు కోడంగల్‌ ఎమ్మెల్యేగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు కష్టాల కడలిలో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలను కూడా తన శైలిలో నిర్వర్తిస్తున్నారు.

Time Line

  • జననం

    నేను మహబూబ్నగర్ జిల్లా కొండా రెడ్డి పల్లి నవంబర్ 8, 1969 న జన్మించాడు. నేను ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు ఉన్నాను.

  • జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక

    2006 లో అతను మిడ్జిల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ పార్టీ ఓట్ల లాభం 51,65% తో ZPTC ఎన్నికల గెలిచింది.

  • శాసనమండలి సభ్యుడు

    అతను 2008 లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనమండలికి ఎమ్మెల్సీ సభ్యుడు ఎన్నికయ్యారు.